11.44 లక్షల పాన్ కార్డులను తొలగించాం: కేంద్రమంత్రి
దేశవ్యాప్తంగా సుమారు 11.44 లక్షలకు పైగా పర్మనెంట్ అకౌంట్ నంబర్ల (పాన్)ను తొలగించి వేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 11.44 లక్షలకు పైగా పర్మనెంట్ అకౌంట్ నంబర్ల (పాన్)ను తొలగించి వేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు.
ఒకే వ్యక్తికి పలు పాన్‌లు ఉన్నట్లు కనుగొన్న నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు వివరించారు.

సుమారు 1,566 పాన్‌లను నకిలీవిగా గుర్తించినట్లు తెలిపారు. ఏవైనా తేడాలున్న సందర్భాల్లో వాటిని తొలగించివేసే సదుపాయం సంబంధిత అంచనా అధికారి వద్ద ఉన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications