భారత్‌లో కనిపించే ఈ జాతి జంతువులే నిపా వైరస్‌కు మూలకారణం: పరిశోధకులు
నిపా వైరస్... ప్రమాదకరమైన వైరస్. గతేడాది ఒక్క కేరళలోనే 17 మంది ప్రాణాలు తీసిన అతిప్రమాదకరమైన వైరస్. ప్రస్తుతం మళ్లీ కోరలు చాచేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో గబ్బిలం జాతికి చెందిన 11 జంతువులు నిపా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశోధకులు తమ ప్రాథమిక పరీక్షల ద్వారా వెల్లడించారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ బ్యాట్‌కు నిపా వైరస్ సోకిందని అది పండ్లను కొరికినప్పుడు ఆ వైరస్ అందులోకి ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
గబ్బిలం జాతికి చెందిన 113 జంతువుల్లో 31 జంతువుల శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది. ఇ:దులో 11 జంతువుల్లో నిపా వైరస్ లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో ఫలితాలు 83శాతం అక్యూరసీతో సరిపోలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ జంతువులు ఎలాంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయనేదానిపై ఇంకా స్టడీ చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆ ఆహారంను మనుషులు తీసుకుంటే వారికి నిపా వైరస్ సోకి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రైనా ప్లో రైట్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఈ పరీక్షలు అమెరికాలోని మోంటానా స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీకి చెందిన పీఓ నమీర్ కూడా ఉన్నారు.

-
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications