టెక్కీ దంపతుల నెలల చిన్నారని కొట్టి కెమెరాకి చిక్కింది

ఆ పదకొండేళ్ల చిన్నారి పేరు హిమేష్ కుమార్ అలియాస్ హ్యాపీ. కేర్ టేకర్ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గత రెండు రోజులుగా సదరు కేర్ టేకర్ అతనిని చితకబాదింది.
ఈ చిన్నారి తల్లిదండ్రులు తమ ఇంట్లో సిసిటీవీ కెమెరాలను పెట్టారు. వీటి ద్వారా కేర్ టేకర్ చిన్నారిని కొట్టిన విషయాన్ని గుర్తించారు.
ఈ ఘటన పైన హ్యాపీ తల్లిదండ్రులు వసంత (31), నవీన్ కుమార్ (31)లు మే 8వ తారీఖున దత్తవాడి పోలీసు స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. హడప్సర్‌కు చెందిన కేర్ టేకర్ బేబీ లక్ష్మణ్ పటోల్ పైన కేసు పెట్టారు. ఈమె ఓ ప్లేస్‌మెంట్ సంస్థ ద్వారా కేర్ టేకర్‌గా వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఆమెను అరెస్టు చేశారు.
ఈ ఘటన పైన చిన్నారి తల్లి వసంత మాట్లాడుతూ... తాము మే 8వ తేదీన ఉదయం నాలుగున్నర గంటలకు ఉద్యోగం అనంతరం ఇంటికి వచ్చామని, సిసిటీవీ ఫుటేజ్‌లను చూశామని, కేర్ టేకర్ తమ తనయుడిని బొమ్మ మాదిరి పైకి ఎత్తి విసిరి వేయడాన్ని గుర్తించామని చెప్పారు. తన తనయుడిని కొడుతుండటాన్ని, తోసివేయడాన్ని గుర్తించామని చెప్పింది. తన కొడుకు పట్ల అలా ప్రవర్తించడాన్ని తాను తట్టుకోలేకపోయానని చెప్పారు. తాను వెంటనే తన బంధువుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.












Click it and Unblock the Notifications