58 కేజీల బంగారు బిస్కెట్లు సీజ్: 12 మంది అరెస్టు
కోల్ కతా: అక్రమంగా రవాణా చేస్తున్న 58 కిలోల బంగారాన్ని రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న 12 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
కోల్ కత్తాలో బంగారు బిస్కెట్లు రహస్యంగా తరలిస్తున్నారని రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. ఉత్తర కోల్ కతాలోని రవీంద్ర సరాని ప్రాంతంలో నిందితులు తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు.
బంగారు బిస్కె ట్లు దాచి పెట్టిన స్థావరంపై రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు దాడి చేశారు. స్మగ్లింగ్ చేస్తున్న ఓ మహిళతో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల నుంచి రూ. 18 కోట్ల విలువైన 58 కిలోల బరువున్న 350 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
నిందితులు మయన్మార్ నుంచి బంగారు బిస్క్ ట్లు అక్రమంగా భారత్ తీసుకువచ్చారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిందితులను సిటి సివిల్ కోర్టులో హాజరుపరిచామని ఆగస్టు 22వ రకు 12 మందిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications