ఘోర బస్సు ప్రమాదం: కాలువలో పడటంతో 12 మంది మృతి, 20 మందికి గాయాలు
ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలోని ఖోపోలి ప్రాంతంలో బస్సు లోతైన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడ్డారు.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రైవేట్ బస్సు పూణె నుంచి ముంబై వెళ్తుండగా పాత ముంబై-పూణే హైవేపై షింగ్రోబా దేవాలయం సమీపంలోని లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30-35 మంది ప్రయాణికులు ఉన్నారని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
బస్సులోని ప్రయాణికులు గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఒక సంస్థకు చెందినవారు. వారు ఒక కార్యక్రమం కోసం పూణెకు వెళ్లి శనివారం తిరుగు ప్రయాణంలో ఉన్స సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Maharashtra| 7 people died & more than 25 injured after a bus fell into a ditch in Raigad's Khopoli area. Rescue operations underway: Raigad SP pic.twitter.com/kneqn5M4A5
— ANI (@ANI) April 15, 2023












Click it and Unblock the Notifications