16 ఏళ్ల బాలికతో సంబంధం: తండ్రైన 12 ఏళ్ల బాలుడు, రికార్డ్!!

కేరళలోని అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పన్నెండేళ్ల బాలుడు తండ్రి అయ్యాడు. పదహారేళ్ళ సంవత్సరాల వయస్సు గల యువతితో లైంగిక సంబంధం ద్వారా అతను ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆమె ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది.

కొచ్చి: కేరళలోని అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పన్నెండేళ్ల బాలుడు తండ్రి అయ్యాడు. పదహారేళ్ళ సంవత్సరాల వయస్సు గల యువతితో లైంగిక సంబంధం ద్వారా అతను ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆమె ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది.

దేశంలోనే అతిపిన్న వయస్సుగల తండ్రిగా

దేశంలోనే అతిపిన్న వయస్సుగల తండ్రిగా

దీంతో దేశంలోనే అతి పిన్నవయస్కుడైన తండ్రిగా ఆ బాలుడు రికార్డులకెక్కాడు. కేరళ ఎర్నాకుళంలోని ఓ ఆసుపత్రిలో ఆ యువతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు, యువతికి సంబంధించిన వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు.

డీఎన్ఏ సరిపోవడంతో..

డీఎన్ఏ సరిపోవడంతో..

ఆ బాలుడి డీఎన్‌ఏ పుట్టిన బిడ్డకు సరిపోవడంతో అతనే తండ్రిగా వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై తిరువనంతపురం మెడికల్‌ కాలేజ్‌ ఎండోక్రినాలజీ విభాగ అధిపతి డాక్టర్‌ పికె జబ్బార్‌ మాట్లాడారు.

అకాల యుక్త వయస్సు రావడం వల్లే

అకాల యుక్త వయస్సు రావడం వల్లే

ఆ బాలుడికి అకాల యుక్తవయస్సు రావడం వల్లే ఇలా జరిగి ఉంటుందన్నారు. అయితే ఇదేమీ అసాధారణ పరిస్థితి కాదని, ఇంత వరకూ తన దృష్టికి ఇలాంటి ఘటనలేవీ రాలేదని, ఇదే తొలిసారని తెలిపారు.

పోస్కో చట్టం కింద కేసు

పోస్కో చట్టం కింద కేసు

మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరూ మైనర్లు కావడంతో న్యాయపరంగా ఇదో చిక్కుగా మారింది. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, పుట్టిన పాపను చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు అప్పగించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పాపను తీసుకునేందుకు అంగీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+