వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: పదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర: మహారాష్ట్రలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేయడంతో ఆ పసిబిడ్డ గర్భం దాల్చింది. ఇక వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక ఇక్కడ అసలు సంగతి ఏమిటంటే చిన్నారి పై అత్యాచారం చేసింది కూడా మైనర్ బాలుడే. బాలిక వయస్సు 10 ఏళ్లు కాగా.... అత్యాచారం చేసిన బాలుడి వయస్సు 12 ఏళ్లు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది.

అత్యాచారానికి పాల్పడ్డ బాలుడు బాలిక పొరిగింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. గత నాలుగు నెలలుగా అమ్మాయిపై బాలుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పిగా ఉందని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చింది. సాధారణ కడుపునొప్పిగా భావించిన తల్లిదండ్రులు చిన్నారని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడే వారికి గుండెలు పగిలే నిజం తెలిసింది. అమ్మాయిని పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం బాలిక గర్భవతని చెప్పారు. అయితే బాలికను ఇది ఎలా జరిగిందని ప్రశ్నించగా అసలు సంగతి బయటపెట్టింది. ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

rape

ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అబ్బాయిపై ఐపీసీ సెక్షన్ 376 అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు అబ్బాయిని పోలీసులు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. చిన్నారిపై 12 ఏళ్ల బాలుడికి అత్యాచారం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందనే దానిపై అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే 10 ఏళ్ల చిన్నారిపై బాలుడు లైంగిక దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.

English summary
A 10-year-old girl was allegedly repeatedly raped by a boy at a village in Palghar district of Maharashtra, police said on Saturday.The boy, 12, was booked following a complaint lodged by the girl's parents, police said."Both the minors are neighbours. As per the complaint, the boy had been raping the girl since the last four months," an official of Mokhada police station said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X