లైంగికదాడి: నాలుగంతస్తుల భవనం నుండి దూకిన బాలిక
ముంబై:లైంగిక వేధింపుల నుండి తప్పించుకొనేందుకు మైనర్ బాలిక నాలుగు అంతస్థుల భవనం నుండి కిందకు దూకింది. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.
మహరాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లా ఆలకాపూరి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారంగా ఓ మైనర్ బాలికను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి మాయా మాటలు చెప్పి తీసుకెళ్ళాడు.

ఓ కాగితంపై ఉన్న అడ్రస్‌ను చూపించాలని తన వెంట తీసుకెళ్ళాడు. ఓ భవనం వద్దకు తీసుకెళ్ళి బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఆ నిందితుడి నుండి బాలిక తప్పించుకొంది. ఈ క్రమంలోనే తప్పించుకొనేందుకు గాను ఆ బాలిక నాలుగంతస్థుల భవనం నుండి కిందకు దూకింది.
తీవ్రంగా గాయపడిన ఆ బాలికను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.ఆ బాలిక ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.అయితే బాలికను నమ్మించి భవనం వద్దకు తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications