జార్ఖండ్‌లో కారును ఢీకొన్న రైలు: 13మంది మృతి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాపలా లేని బుర్కుందా రైల్వే క్రాసింగ్ వద్ద హౌరా-భోపాల్ ఎక్స్‌ప్రెస్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని రామ్‌గఢ్ జిల్లా ఎస్పీ ఎం. తమిళవణన్ మంగళవారం వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తమిళవనన్ తెలిపారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications