Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ దారుణాలకు ఎండ్ పడదా.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం ??

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. దీంతో సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మానవత్వాన్ని మంటగలిపేలా చేసే లైంగిక దాడుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు ఘటనలు సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి. ఒక ఘటనలో కేవలం 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరగగా, మరో ఘటనలో 82 ఏళ్ల గిరిజన వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

హుబ్బళ్లిలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..

కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం 13 ఏళ్ల వయసున్న ఓ బాలికపై 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, అదే ప్రాంతంలో నివసించే ముగ్గురు బాలురు ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పాక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. బాలికకు మానసిక, వైద్య సహాయం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

13-year-old-girl-gang-raped-at-karnataka-and-82-years-old-women-rape-at-madhya-pradesh

వీడియో తీసి బెదిరింపులు..

హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ మాట్లాడుతూ.. బాధిత బాలికకు అవసరమైన రక్షణ కల్పించామని, ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు కాగా, మరో బాలుడు స్కూల్ మానేసిన డ్రాప్‌అవుట్‌గా గుర్తించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, నిందితులు ఈ ఘటనను వీడియో తీసి ఆమెను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లో 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. సిర్మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 82 ఏళ్ల గిరిజన వృద్ధురాలిపై పక్కింట్లో నివసించే సుగ్గా సాకేత్ అనే యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా, నిందితుడు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడని బాధితురాలు పేర్కొన్నారు.

పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు..

అయితే ఈ ఘటన అనంతరం వృద్ధురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయగా, వారు ఆమెను వెంట తీసుకుని సిర్మౌర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, వైద్య పరీక్షలు కూడా నిర్వహించలేదని బాధితురాలు ఆరోపించారు. వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లే పరిస్థితి ఉందని సమాచారం.

పోలీసుల నిర్లక్ష్యంతో న్యాయం జరగలేదని భావించిన కుటుంబ సభ్యులు, శనివారం ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఘటనపై మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మాట్లాడుతూ, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. దర్యాప్తు ఫలితాల ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+