వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు, పాఠశాల విద్యార్థిని లాక్కెళ్లి పార్క్ లో రేప్ !

|
Google Oneindia TeluguNews

ఛంఢీగడ్: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు పూర్తి కావడంతో ఇంటికి నడిచి వెలుతున్న బాలిక మీద కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన హరియాణా రాజధాని ఛంఢీగడ్ లో జరిగింది. 13 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురికావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు చెప్పారు.

ఛంఢిగడ్ సెక్టార్ 23లోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంగళవారం స్కూల్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైయ్యింది. మద్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్ దగ్గర 40 ఏళ్ల వ్యక్తి బాలికను అడ్డగించాడు.

13- years- old girl raped in Chandigarh

తరువాత బాలిక నోరుమూసిపెట్టి పార్క్ లోని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి పరారైనాడు. అటువైపు వెలుతున్న వారు బాలిక ఏడుస్తున్న విషయం గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛంఢీగడ్ లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా పాఠశాల విద్యార్థిని మీద అత్యాచారం జరగడంతో స్థానికులు హడలిపోయారు.

English summary
13- years- old girl raped in Chandigarh in Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X