14 రకాల రూ.10 నాణేలు.. అన్నీ చెల్లుబాటవుతాయి: స్పష్టం చేసిన ఆర్బీఐ

ముంబై : రూ.10 నాణేల చలామణీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించింది. రూ.10 నాణేల్లో 14 డిజైన్లు ఉన్నాయని, ఇవన్నీ చెల్లుబాటవుతాయని బుధవారం స్పష్టంగా ప్రకటించింది.

కొందరు వర్తకులు రూ.10 నాణేలను తీసుకునేందుకు అంగీకరించడం లేదన్న వార్తలపై ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. కొన్ని చోట్ల వ్యాపారులు, కొందరు ప్రజలు రూ.10 నాణేలను వాటి యథార్థత గురించి అనుమానాల వల్ల తిరస్కరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.

 All 14 types of Rs 10 coin valid, legal tender, says RBI

ప్రభుత్వ టంకశాలలో తయారు చేసిన నాణేలను చలామణిలోకి తెస్తున్నట్లు వివరించింది. వివిధ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విలువలను ఇతివృత్తంగా తీసుకుని ఈ నాణేలను డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు 14 డిజైన్లలో రూ.10 నాణేలను తయారు చేసి, విడుదల చేసినట్లు పేర్కొంది. అన్ని రకాల లావాదేవీల్లోనూ వీటిని ఉపయోగించుకోవచ్చునని, రూ.10 నాణేలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+