బాలికతో అసభ్యంగా, బెదిరింపులు: బాలుడికి వ్యక్తి లైంగిక వేధింపు

రాయ్‌పూర్/ముజఫర్ నగర్: చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో ఓ హాస్టల్లో వసతి గృహం సూపరింటెండెంట్ 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తుల్సీరామ్ యాలమ్ అనే 38 ఏళ్ల వ్యక్తి హాస్టల్లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నాడు.

అతను రెసిడెన్షియల్ మోడల్ స్కూల్‌ను నడుపుతున్నాడు. ఇతను గత ఏడాది డిసెంబర్ నెలలో బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఏడో తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా అతను ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు.

తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం ఆమె ఎవరితోను చెప్పుకోలేకపోయింది. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

14 year old molested by hostel superintendent

ఆయన వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక స్నేహితులు ఈ విషయం చెప్పింది. అయితే, సూపరింటెండెంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ఆదివారం నాడు బాధిత బాలిక ఆంటీ పాఠశాలకు వచ్చింది. అప్పుడు ఆ బాలిక ఆమెకు విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

12 ఏళ్ల బాలుడితో సంపర్కం, అరెస్ట్

ముజఫర్ నగర్‌లోని ఖాడేర్వాలా ఏరియాలో ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలుడితో సంపర్కం చేసిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 19న బాలుడిని సల్మాన్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అతనిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+