పశ్చిమ బెంగాల్‌లో అమ్మాయిపై అత్యాచారం: ఉరేసుకుని ఆత్మహత్య

అమ్మాయిపై సెప్టెంబర్ 30వ తేీదన అహలిదిపూర్‌లో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె శనివారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసి పెట్టిన సూసైడ్ నోట్ పోలీసుల చేతికి చిక్కింది. ఎఫ్ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని నిందితుడు తనపై, తన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆ నోట్‌లో ఆరోపించింది.
బాలిక శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువకుడు ఇంట్లోనే అమ్మాయిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత అమ్మాయిని అతను వేధించడం ప్రారంభించాడు. కేసు ఉపసంహరించుకోవాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు బుర్ద్వాన్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఎస్ఎంహెచ్ మీర్జా చెప్పారు.
బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు యువకుడి తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారంనాడు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. యువకుడి తల్లి సిజెఎం అనుషా లామా, మరో ఫ్యామిలీ మెంబర్‌ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరో ఇద్దరిని డిసెంబర్ 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications