కూతుర్ని సెక్స్ రాకెట్లోకి దించేందుకు యత్నించిన నటి: డైరెక్టర్ అరెస్ట్

చెన్నై: సీబీసీఐడీ పోలీసులు మంగళవారం నాడు వడపళనిలో ఓ తమిళ నటిని అరెస్టు చేశారు. తన పద్నాలుగేళ్ల కూతురును వ్యభిచారకూపంలోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు పోలీసులు ఆ నటిని అరెస్టు చేశారు. ఆ నటి స్వయంగా తాను కూడా అందులో మునిగిపోయేందుకు సిద్ధమైంది.

ఈ విషయం తెలిసిన పోలీసులు ఓ దర్శకుడిని, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఓ హోటల్లో ఈ డీల్ జరుగుతున్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు రైడ్ చేశారు.

ఓ ఎన్జీవో సంస్థ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించింది. దీంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ద్వారా చేధించారు. పోలీసులు కాపాడిన బాలిక వయస్సు 14 ఏళ్లు ఉంటుంది. కూతురును సెక్స్ ట్రేడ్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన నటి రాజేశ్వరి, సెంథిమిలరసు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

14 yr old Girl Rescued From Flesh Trade Racket

పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ద్వారా చేధించారు. కస్టమర్లుగా వెళ్లిన పోలీసులు వారిని కలిశారు. ఆ బాలికతో గడపాలంటే రూ.1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు మొదట పదివేల రూపాయలు ఇచ్చారు. మిగిలిన మొత్తం తర్వాత ఇస్తామని చెప్పారు.

వారు లోపలకు వెళ్లాక బాలిక మైనర్ అని గుర్తించారు. బయట ఉన్న పోలీసులను అలర్ట్ చేశారు. వెంటనే పోలీసులు లోపలకు వచ్చారు. బాలికను రక్షించి, నిందితులను అరెస్టు చేశారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితులను రిమాండుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+