ఆర్ కే నగర్ లో రూ. 29 లక్షలు సీజ్, 143 మంది అరెస్టు: ఎవరి వర్గం అంటే !
ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఓటర్లకు పంచిపెట్టడానికి తీసుకు వెలుతున్న రూ. 29 లక్షలు స్వాధీనం చేసుకుని నగదు సీజ్ చేసి 143 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించామని ఉప ఎన్నికల ప్రత్యేక అధికారి కార్తికేయన్ మీ
చెన్నై: చెన్నైలోని ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల సందర్బంగా విచ్చలవిడిగా ఓటర్లకు నగదు పంపిణి చేస్తున్న వారి మీద ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పంజా విసిరారు. నగదు పంపిణి చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు.
ఆర్ కే నగర్ నియోజక వర్గంలో స్థానిక పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, అధికారంలో ఉన్న శశికళ వర్గానికి సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆర్ కే నగర్ నియోజక వర్గంలో కేంద్ర బలగాలు మొహరిస్తున్నాయి.

143 మంది జైలుకు
ఆర్ కే నగర్ నియోజక వర్గంలో తామూ సూచించిన అభ్యర్థులకు ఓటు వెయ్యాలని స్థానికులను మభ్యపెడుతూ నగదు పంపిణి చేస్తున్న 143 మందిని అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

రూ. 29 లక్షలు సీజ్
ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఓటర్లకు పంచిపెట్టడానికి తీసుకు వెలుతున్న రూ. 29 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, నగదు సీజ్ చేశామని శనివారం ఉప ఎన్నికల ప్రత్యేక అధికారి కార్తికేయన్ మీడియాకు చెప్పారు. ఇప్పటి వరకు 143 మందిని అరెస్టు చేశామని ఆయన దృవీకరించారు.

ఆర్ కే నగర్ లో సీసీ కెమెరాలు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా సున్నితమై ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పత్రి నిత్యం సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్నారు.

ఒక్క వాహనం వదిలి పెట్టలేదు
ఆర్ కే నగర్ నియోజక వర్గంలోకి వచ్చి వెలుతున్న అన్ని వాహనాలను కేంద్ర బలగాలు పరిశీలిస్తున్నాయి. కార్లు, ఆటోలు, బస్సుల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

వీడియో ఎఫెక్ట్
ఆర్ కే నగర్ నియోజక వర్గంలో నగదు పంచిపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యారు. మఫ్టీలో ఆర్ కే నగర్ నియోజక వర్గంలో సంచరిస్తున్న ఎన్నికల అధికారులు పలు పార్టీల నాయకులు, కార్యకర్తల మీద నిఘా వేశారు.












Click it and Unblock the Notifications