నిఘా నీడలో బెంగళూరు: 15 వేల మంది పోలీసులు (ఫోటోలు)

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగరంలో ఆందోళనలు ఎక్కువ అయ్యాయి. సోమవారం మద్యాహ్నం ఒక్క సారిగా కన్నడ సంఘాలు రోడ్ల మీదకు రావడంతో సామాన్య ప్రజలు హడలిపోయారు.

బెంగళూరు నగరంలో 15,000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారితో పాటు సాయుధ బలగాలు, 3,000 మంది హోం గార్డులు, 270 మంది చీతా పోలీసులు విధులలో ఉన్నారు.

నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో షాపులు మూతపడ్డాయి. కొందరు స్వచ్చందంగా షాపులు, దుకాణాలు, హోటల్స్, మాల్స్ మూసివేశారు. పలు చోట్ల ఆందోళనకారులు బలవంతంగా షాపులు బంద్ చేయించారు.

బెంగళూరు నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న ప్రజలు ఇంటికి పరుగు తీశారు. పలు ప్రాంతాల్లో బీఎంటీసీ బసు సర్వీసులు రద్దు చెయ్యడంతో ప్రయాణికులు నానా ఇబ్బంది ఎదుర్కోన్నారు.

మెట్రో రైలు ప్రయాణికుల అవస్థలు

మెట్రో రైలు ప్రయాణికుల అవస్థలు

గొడవలు ఎక్కువ కావడంతో సోమవారం మద్యాహ్నం బెంగళూరు మెట్రో రైలు సర్వీసులు రద్దు చేశారు. రైలు ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోన్నారు.

ఇండ్లకే పరిమితం అయిన తమిళ ప్రజలు

ఇండ్లకే పరిమితం అయిన తమిళ ప్రజలు

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న తమిళ ప్రజలు తలుపులు వేసుకుని ఇండ్లకే పరిమితం అయ్యారు. బయటకు రావడానికి తమిళ ప్రజలు హడలిపోతున్నారు.

రంగంలోకి అదనపు బలగాలు

రంగంలోకి అదనపు బలగాలు

తమిళ ప్రజలు అధికంగా నివాసం ఉంటున్న పలు ప్రాంతాల్లో సాయుధ బలగాలను రంగంలోకి దించారు. గొడవలు జరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

పరిస్థితి అదుపులో ఉంది: చరణ్ రెడ్డి

పరిస్థితి అదుపులో ఉంది: చరణ్ రెడ్డి

బెంగళూరు నగరంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని అడిషినల్ పోలీసు కమిషనర్ చరణ్ రెడ్డి మీడియాకు చెప్పారు.

లారీలు భూడిద

లారీలు భూడిద

బెంగళూరుతో పాటు నగర శివార్లలో తమిళనాడు లారీలకు నిప్పంటించారు. పలు వాహనాలు భూడిద అయ్యాయి. అనేక వాహనాల మీద రాళ్ల వర్షం కురిపించారు.

దుమ్ములేపేశారు

దుమ్ములేపేశారు

బెంగళూరు-హోసూరు రహదారిలోని అత్తిబెలె (తమిళనాడు సరిహద్దు)లో తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న లారీలు బారులు తీరాయి. అనేక వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించడానికి ప్రయత్నించారు.

దుకాణాలు ద్వంసం

దుకాణాలు ద్వంసం

బెంగళూరు నగరంలోని ఇందిరానగర, సిటి మార్కెట్, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్ సిటి తదితర ప్రాంతాల్లో తమిళ ప్రజలు నిర్వహిస్తున్న హోటళ్లు, దుకాణాలు ధ్వంసం చేశారు.

వ్యాపారాలు బంద్

వ్యాపారాలు బంద్

బెంగళూరులో నివాసం ఉంటు వ్యాపారం చేస్తున్న తమిళ ప్రజలు వారి దుకాణాలు మూసివేసి రక్షించు దేవుడా అంటూ ఇంటికి పరుగు తీశారు.

నోరు విప్పడానికి భయం

నోరు విప్పడానికి భయం

తమిళ ప్రజలు నోరు విప్పడానికి హడలిపోతున్నారు. తమిళ్ మాట్లాడితే ఎక్కడ చితకబాదేస్తారో అని హడలిచస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+