Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఉద్యోగుల ఖాతాలో 15వేలు.. అప్లై చేసుకోటానికి త్వరపడండి!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే యువతను ప్రోత్సహించడం కోసం ఉపాధిని పెంచడం కోసం ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన పథకం ఉపయోగపడుతుంది.

పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి మరియు ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించడానికి భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకం. 2025 జులై 1వ తేదీన కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందిన ఈ పథకం 2025 ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

15 thousand in the account of newly job joined employees Apply for PMVBRY

Take a Poll

దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్
దేశంలో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహాన్ని అందించడానికి, ముఖ్యంగా తయారీ రంగం పైన ప్రత్యేకమైన దృష్టిని సారించడానికి దీనిని లక్ష్యంగా చేసుకొని ప్రారంభించారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమలు చేస్తోంది.

కొత్తగా ఉద్యోగం చేసేవారికి 15 వేల రూపాయలు
ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు, యువతను ప్రోత్సహిస్తూ ఉద్యోగాల కల్పన చేస్తున్న సదరు యజమానులకు కూడా మద్దతు లభిస్తుంది. తొలిసారి ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు ఒక నెల వేతనం గరిష్టంగా 15 వేల రూపాయల వరకు ప్రభుత్వం వారికి అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం రెండు విడతలుగా నేరుగా వారి బ్యాంకు ఖాతా కి చేరుతుంది.

ఇలా చేస్తేనే పథకంలో లబ్ది
అయితే ఉద్యోగంలో చేరిన వారు ఆరు నెలల పాటు పనిచేసిన తర్వాత కేంద్రం అందించే ఈ పథకం తాలుక లబ్ది వారికి అందుతుంది. ఇదే సమయంలో యజమానులకు కూడా అదనపు ఉద్యోగాలను సృష్టిస్తున్న కారణంగా ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో చేసుకోవాలి.

దరఖాస్తులు ఇలా
ఉద్యోగులు యజమాని ద్వారా లేదా ఉమంగ్ యాప్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను పొందాలి. ఆ తర్వాత కనీసం ఆరు నెలలు పనిచేశాక ప్రోత్సాహకం ఖాతాలో జమ అవుతుంది. ఇక యజమానులు, కొత్త సంస్థలు ఎంసీఏ యొక్కSPICE+ పోర్టల్ లేదా, కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క శ్రమ సువిధ పోర్టల్ ద్వారా ఈపీఎఫ్ఓ లో ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. తద్వారా కేంద్రం నుంచి లబ్ధిని పొందవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+