విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !

చెన్నై/ కోవై: అమాయకురాలైన 9వ తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో లైంగిక దాడి చేశాడు. తరువాత నలుగురు స్నేహితులకు ప్రియురాలిని పంచేశాడు. ఆ విషయం తెలుసుకుని బెదిరించి ఆమెపై అత్యాచారం చేసిన మొత్తం 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విధంగా బాలికను పదేపదే లైంగిక దాడికి గురి చేసిన మరో ముగ్గురి కోసం తమిళనాడులోని కోవై (కోయంబత్తూరు) పోలీసులు గాలిస్తున్నారు. 10 మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆ అమ్మాయి గర్బవతి అయ్యింది. ప్రేమ పేరుతో బాలికను తల్లిని చేసిన వారిలో మైనర్లు ఉన్నారని, బాలికకు వైద్యపరీక్షలు చేయిస్తున్నామని కోవై పోలీసులు తెలిపారు.

 9వ తరగతి అమ్మాయి

9వ తరగతి అమ్మాయి

కోయంబత్తూరులో కట్టడ కార్మికులు నివాసం ఉంటున్నారు. కట్టడ కార్మికుడిగా పని చేస్తున్న వ్యక్తి కుమార్తె (15) ఉంది. ఈ అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నది. తల్లిదండ్రులు రోజూ కట్టడం నిర్మాణ పనులుకు వెలుతున్న సమయంలో ఈ అమ్మాయి స్కూల్ కు వెలుతున్నది.

కడుపునొప్పితో ఆసుపత్రికి!

కడుపునొప్పితో ఆసుపత్రికి!

అమ్మాయికి కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఆమెను తల్లిదండ్రులు కోవై ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని చెప్పారు. స్కూల్ కు వెలుతున్న తమ కుమార్తె గర్బవతి అయ్యిందని తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్ కు గురైనారు. వెంటనే కోవై ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

కరోనా భయంతో పరార్

కరోనా భయంతో పరార్

కేసు నమోదు చేసిన కోవై ఈస్ట్ మహిళా పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. దేశం మొత్తం కరోనా వైరస్ భయంతో హడలిపోతున్న విషయం ఆ బాలికకు తెలిసింది. అప్పటి వరకు బాలిక తాను గర్బవతి అనే విషయం తెలీకుండా ఆమె తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు. తనకు కరోనా వైరస్ చికిత్స చేస్తున్నారనే భయంతో ఆ బాలిక కోవై ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయింది.

వెంటాడిన పోలీసులు

వెంటాడిన పోలీసులు

ఆసుపత్రి నుంచి పారిపోయిన బాలిక కోసం పోలీసులు గాలించారు. చివరికి బాలిక తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను మహిళా పోలీసుల సహాయంతో అసలు ఏం జరిగింది అంటూ పూర్తి సమాచారం బయటకులాగారు. ప్రేమ పేరుతో తనతో చనువుగా మెలిగిన యువకుడు, అతని స్నేహితులు తన మీద అత్యాచారం చేశారని బాలిక బోరున విలపించింది. ఈ విషయం బయటకు చెబితే తనను చంపేస్తామని తన ప్రియుడు, అతని స్నేహితులు బెదిరించారని బాలిక జరిగిన విషయం మొత్తం కోవై పోలీసులకు చెప్పింది.

బెండ్ తీసిన పోలీసులు

బెండ్ తీసిన పోలీసులు

బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడు, అతని స్నేహితులతో పాటు మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మీద అత్యాచారం చేశామని అంగీకరించిన కోవైకు చెందిన ధనశేఖర్ (24), కార్తీక్ (23), సింగనల్లూరు ప్రాంతానికి చెందిన సంతోష్ (20)తో పాటు ప్లస్ వన్ , ప్లస్ టూ (ఇంటర్) చదువుతున్న మరో నలుగురిని కోవై ఈస్ట్ మహిళా పోలీసులు అరెస్టు చేశారు.

Recommended Video

    Viral NRI Women Apologies Indo - American Residents
    ప్రియుడే కామాంధుడు

    ప్రియుడే కామాంధుడు

    బాలికకు మాయమాటలు చెప్పిన ఓ విద్యార్థి ఆమెను లోంగదీసుకుని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు బాలికను బెదిరించి పదేపదే అత్యాచారం చేశారు. బాలిక ఇంటిలో ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో అక్కడికెళ్లి అత్యాచారం చేశామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. బాలిక విషయం తెలుసుకుని ఆమెను బెదిరించి అత్యాచారం చేసిన మరో ముగ్గురు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను కోర్టు ముందు హాజరు పరిచి జువైనల్ హోమ్ కు తరలించామని, మరో ముగ్గురిని జైలుకు పంపించామని, పరారైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని కోవై ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+