మహిళలపై దాడులు: కేసుల్లో 21 మంది ఏపీ ఎంపీ ఎమ్మెల్యేలు..17 మంది ఆ పార్టీ వారే..!
Crime against Women: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ దీని తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. మరింత పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ఉధృతమౌతున్నాయి.
ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు.

ఈ పరిస్థితుల్లో అసోసియేషన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కీలక నివేదికను బయటపెట్టింది. మహిళలపై దాడులు, ఆకృత్యాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడిన వాళ్లు ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో అడుగుపెట్టారనే విషయంపై ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఇలాంటి కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఏడీఆర్ రిపోర్ట్. ఎన్నికల సమయంలో వాళ్లు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. దీనికోసం 4,693 అఫిడవిట్లను పరిశోధించినట్లు ఏడీఆర్ పేర్కొంది.
ఈ జాబితాలో ఈ లిస్టులో పశ్చిమ బెంగాల్ టాప్‌లో ఉంది. 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి కేసులు నమోదయ్యాయి. రెండో స్థానం ఏపీదే. ఏపీలో 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు- మహిళలపై దాడులు చేసిన కేసులను ఎదుర్కొంటోన్నారు. 17 మందితో ఒడిషా మూడోస్థానంలో నిలిచింది.
పార్టీల పరంగా చూసుకుంటే 54 మంది బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్- 23, తెలుగుదేశం పార్టీ- 17 మంది తొలి మూడు స్థానాల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications