కర్నాటక బీజేపీలో ముసలం.. సీఎం కొడుకుపై సంచలన ఆరోపణలు.. 16 మంది ఎమ్మెల్యేల అసమ్మతి
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారును కూలగొట్టడంలో బిజీగా ఉన్న బీజేపీకి కర్నాటకలో ఊహించని పరిణామం ఎదురైంది. ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు సీఎం యడ్యూరప్పపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసమ్మతిరాగం ఆలపించారు. ఆరోగ్య కారణాల వల్ల సీఎం సరిగా పనిచేయకపోతుండటంతో.. ఆయన కొడుకు విజయేంద్ర యడ్యూరప్ప 'సూపర్ సీఎం'గా వ్యవహరిస్తున్నాడని.. కాంట్రాక్టులు, కేటాయింపుల వ్యవహారాల్లో అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్యేలు ఆరోపించారు.
సీఎం యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర అక్రమ వ్యవహారాలను ప్రస్తావిస్తూ శుక్రవారం విడుదలైన లేఖ కర్నాటకలో సంచలనం రేపుతున్నది. ''బీజేపీకి అత్యంత విధేయులైన వ్యక్తులు''పేరుతో విడుదలైన లేఖను.. ఆ 16 ఎమ్మెల్యేలే రాసి ఉంటారని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటిదే ఓ లేఖాస్త్రాన్ని వదిలిని అసమ్మతిదారులు.. సీఎం యడ్యూరప్ప ఆరోగ్య పరిస్థితిపై సంచలన అంశాలు ప్రస్తావించారు. తాజా లేఖలోనేమో.. సీఎం ఆరోగ్య కారణాల వల్ల ఆఫీసుకు రాకపోవడంతో ఆయన కొడుకు షాడో సీఎంగా ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు.

బెంగళూరులో గురువారం జరిగిన బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలోనూ తీరప్రాంత జిల్లాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు.. సీఎం ఎదురుగానే అసంతృప్తి వెళ్లగక్కినట్లు వార్తలొచ్చాయి. యడ్డీ పనితీరు బాగోలేదని, పాలనలో ఫ్యామిలీ(కొడుకు) జ్యోక్యం మితిమీరిందని తెగేసి చెప్పడంతో సీఎం కూడా ఘాటుగానే స్పందించారట. 'నియోజకవర్గాల అభివృద్ధి'కి కావాల్సినన్ని నిధులు ఎప్పటికప్పుడు ఇస్తున్నప్పటికీ ఇలాంటి నిందలు వేయడమేంటని సీఎం వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్నాటక బీజేపీలో ముసలం ఎటువైపు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications