50 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన బస్సు!
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి సుమారు 50 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై సుమారు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కర్ణ ప్రయాగ-కాళేశ్వర్ మధ్య అదుపు తప్పింది. ప్రమాదాలను నివారించడానికి రోడ్డు పక్కన నిర్మించిన రెయిలింగ్‌ను ఢీ కొట్టి లోయలోకి జారింది. పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా 25 మంది గాయపడ్డారు. బస్సు పల్టీ కొట్టిన దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. లోయ నుంచి క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చారు.
వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హృషికేష్-బద్రీనాథ్ జాతీయ రహదారిపైనే మంగళవారం మరో ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తోన్న ట్యాక్సీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications