కంగారు పెట్టిస్తోన్న కరోనా.. కొత్త కేసులు 16 వేలు.. కేరళలో మరణాలు ఎక్కువ
కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల నుంచి కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16 వేల 103 కొత్త కేసులు వచ్చాయి. మొన్నటితో పోలిస్తే 2,143 కేసులు ఎక్కువ వచ్చాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష 11 వేల 711కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,35,02,429కి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉండగా.. ఈ వారంలో పాజిటివిటీ రేటు 3.81 శాతంగా నమోదైంది.
గత 24 గంట్లలో కరోనా సోకిన 31 మంది మరణించారు. వీరిలో ఒక్క కేరళలోనే 14 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఐదుగురు చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 21 వేల 199కి చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. కరోనా మరణాల్లో 70 శాతం మంది ఇతర దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదీ కాస్త ఊరట కలిగించే అంశం. సెకండ్ వేవ్‌లో వయస్సుతో సంబంధం లేకుండా మరణాలు జరిగాయి.

కరోనా నుంచి ఇప్పటిదాకా 4 కోట్ల 28 లక్షల 65 వేల 519 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటిదాకా 197.955 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపుగా అందరూ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోసు కూడా ఎక్కువ మందే తీసుకున్నారు. దీని వల్లే కేసులు పెరుగుతున్న తీవ్రత ఆ స్థాయిలో లేదు. మరణాలు సంభవిస్తోన్న వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. సో మిగతావారు మాస్కులు పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శానిటైజర్ కూడా వాడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా కలియ తిరుగుతున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications