కన్న కూతురిపై అత్యాచారం: నిందితునికి 16 ఏళ్ల జైలు

16-year jail term for man who raped daughter
చెన్నై: తన కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి తమిళనాడు కోర్టు 16 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంకెబి నగర్‌లో నివాసముంటున్న నిందితుడు శివకుమార్, ఓ పరికరాల షాపును నడుపుతున్నాడు. కాగా 2007లో 9వ తరగతి చదువుతున్న తన కూతురుపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఒక రోజు ఆమెకు మత్తు పదార్థం కలిపిన సాఫ్ట్ డ్రింకును ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత 2010లో ఆమెను సినిమాకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఆ తర్వాతి రోజు ఫోన్ చేసి ప్రేమిస్తున్నాని చెప్పాడు, అంతేగాక ఈ విషయాలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. తన భార్య ఇంట్లో లేని సమయంలో కూతురును ఓ క్లబ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన ఆ బాలిక తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ విషయంపై భార్య గొడవకు దిగగా.. బయటికి ఎవరికైనా చెబితే మొత్తం కుటుంబాన్నే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. 2011 వరకూ తన కూతురుపై వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాడు శివకుమార్. దీంతో తీవ్ర మానస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్య యత్నం చేసింది. తన చిన్న సోదరికి జరిగిన విషయాన్ని తెలిపింది.

కాగా ఆమె ఎంకెబి నగర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు శివకుమార్‌పై ఐపిసి 376, 354, 506 (2), 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు శివకుమార్‌కు 16 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ఇక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితునికి రూ. 25 వేలు జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+