దారుణం.. యాసిడ్ పోస్తామని బెదిరించి.. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు టీనేజర్ల గ్యాంగ్ రేప్...

పంజాబ్‌లోని లూథియానాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల ఓ బాలికపై ముగ్గురు టీనేజర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తతంగాన్ని తమ సెల్‌‌ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఆదివారం(అగస్టు 30) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

బాధిత బాలిక లూథియానాలోని ఒకరి ఇంట్లో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా... ముగ్గురు టీనేజర్లు ఆమెను అడ్డగించారు. అందులో ఇద్దరు తమ బైక్‌పై ఎక్కాల్సిందిగా ఆమెను బలవంతపెట్టారు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో... ముఖంపై యాసిడ్ పోస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాలిక బైక్ ఎక్కింది.

అక్కడినుంచి ఆమెను తమ గదికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో తమ సెల్‌ఫోన్లలో వీడియో కూడా చిత్రీకరించారు. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందన్న భయంతో బాధితురాలు మొదట ఎవరికీ చెప్పలేదు. కానీ జరిగిన ఘటనతో తీవ్రంగా కుమిలిపోయిన ఆమె మంగళవారం(సెప్టెంబర్ 1) రాత్రి తన తల్లికి అసలు విషయం చెప్పింది.దీంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు.

16-year-old gangraped by teens, obscene act recorded on phones

పోలీసులు నిందితులపై సెక్షన్ 376-D(గ్యాంగ్ రేప్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల వయసు 14-16 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు.

Recommended Video

    హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్

    ఇలాంటి తరహా ఘటనే మణిపూర్‌లోని ఇంఫాల్‌లోనూ వెలుగుచూసింది. ఓ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితులపై ఇంటిపై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+