16 ఏళ్ల అమ్మాయిపై పాఠశాల సిబ్బంది రేప్
కాన్పూర్: కాన్పూర్‌లోని చకేరి ప్రాంతంలో 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశారనే ఆరోపణపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు కృష్ణ, రాజ్‌కుమార్ ఆ బాలిక చదువుకుంటున్న పాఠశాలలో పనిచేస్తున్నారు.
అమ్మాయి పదకొండో తరగతి చదువుతోంది. పాఠశాల ఆవరణలోని క్వార్టర్స్‌లో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. బాధితురాలి తల్లి పాఠశాలలో ఉద్యోగిని. ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి వెళ్లి బాలికపై అత్యాచారం చేసి, విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వెళ్లిపోయారు.

అమ్మాయి విషయాన్ని తన తల్లికి చెప్పింది. అదే విషయాన్ని బాధితారులి తల్లి విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పింది. బాధితురాలు, తల్లి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గురువారంనాడు వారిద్దరిని అరెస్టు చేశారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications