వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వయసు 16: స్వీట్స్ ఆశచూపి బాలికలను రేప్ చేశాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

16-year-old held for raping minors in southeast Delhi
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమర్ కాలనీలో చిన్న పిల్లలను రేప్ చేసిన సంఘటనల్లో 16 ఏళ్ల బాలుడుని సీసీటీవి పుటేజి ఆధారంగా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం దయానంద్ కాలనీలో నివసిస్తున్న 10 ఏళ్ల బాలికను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పైకి తీసుకెళ్లి రేప్ చేశాడు. బిల్డింగ్‌పై సృహతప్పి పడి ఉన్న బాలికను చూసిన కార్మికులు తల్లిదండ్రులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రేప్, హాత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

కొద్ది రోజుల తర్వాత మళ్లీ సరిగ్గా ఇలాంటి సంఘటనే మరోకటి జరిగింది. 7 ఏళ్ల బాలికను అదే ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇంటికి తిరిగి వెళ్లిన బాలిక తనపై జరిగిన రేప్‌ను తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ రెండు సంఘటలను సీరియస్‌‌గా తీసుకుని మార్కెట్‌ సీసీటీవి పుటేజీలను పరిశీలించామన్నారు.

ఈ రెండు సంఘటనల్లో 10 ఏళ్ల బాలికను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పైకి తీసుకెళ్లి అరగంట తర్వాత తిరిగి రావడం చూశామని, బాధితురాలు చెప్పిన సమాచారంతో బాలుడుని గుర్తించామన్నారు. గార్గ్ గ్రామ సమీపంలో బాలుడుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

బాలుడు తన నాయనమ్మతో అమర్ కాలనీలోని జెజె క్లస్టర్ సమీపంలో నివాసం ఉంటున్నాడని... బాలుడి తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడివిడిగా జీవనం సాగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తమ విచారణలో బాలుడు తాను ఈ రెండు సంఘటనలకు బాధ్యుడనని ఒప్పుకున్నట్లు తెలిపారు.

ఒంటరిగా ఆడుకునే పిల్లలనే తన టార్గెట్ అని, వారికి స్వీట్స్, ఫైర్ వర్క్స్ ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి రేప్ చేశానని విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాలుడిని బాల నేరస్తుల బోర్డు ముందు హాజరు పరిచామని, రిఫామ్ హోంకు పంపించనున్నట్లు తెలిపారు.

English summary
A 16-year-old boy accused of raping minor girls in southeast Delhi's Amar Colony has been apprehended after cops received two similar complaints. Police said that he was identified from a CCTV footage in Garhi village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X