ప్రాణం తీసిన క్రికెట్: బ్యాట్, స్టంప్స్‌తో కొట్టి చంపారు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: క్రికెట్‌ ఆటలో చెలరేగిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన ముంబైలోని ధారవి ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది.

శనివారం సాయంత్రం క్రికెట్‌ ఆడుతున్న బాలుర మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పదహారేళ్ల బాలుడిని కొందరు బాలురు బ్యాట్‌, స్టంప్స్‌తో కొట్టి చంపేశారు.

cricket

ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన బాలుడిని అమీర్ హుస్సేన్‌గా గుర్తించాడు. అతనిని బ్యాట్, స్టంప్స్‌తో కొట్టగానే పడిపోయాడని పోలీసులు చెప్పారు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారని, చనిపోయినట్లు వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
teenager attacked him with a cricket bat in Dharavi on Saturday.
Please Wait while comments are loading...