'మహా'దారుణం : 16 ఏళ్ల బాలికపై 10 మంది.. ఆర్నెళ్లుగా గ్యాంగ్ రేప్..
మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. ఓ దళిత మైనర్ బాలికపై 10 మంది వ్యక్తులు ఆర్నెళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన సోలాపూర్ జిల్లాలో బయటపడింది. ఆమెను వేర్వేరు ప్రదేశాలకు తరలిస్తూ పలుమార్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఎవరా బాలిక..
సోలపూర్‌కి చెందిన ఓ బాలిక(16) కుటుంబంతో కలిసి పట్టణంలో నివసిస్తోంది. ఆమె తండ్రి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. దీంతో కుటుంబ భారం తల్లిపై పడింది. బాలిక కూడా తల్లికి చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనులు చేసేది. ఇదే క్రమంలో ఓరోజు ఐదుగురు వ్యక్తులు బాలిక ఇంటికి వచ్చారు. మాయ మాటలతో ఆమెను నమ్మించి వెంట తీసుకెళ్లారు.

ఆర్నెళ్లుగా అత్యాచారం..
ఓ నిర్మానుష్య ప్రదేశానికి బాలికను తీసుకెళ్లారు. అక్కడికి మరో ఐదుగురు వచ్చి చేరారు. మొత్తం 10 మంది కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయట చెబితే తనను,తనవాళ్లను చంపేస్తామని బెదిరించారు. అసలే పేద కుటుంబం.. తాను నిజం చెబితే ఎక్కడ అన్నంత పనిచేస్తారేమోనని ఆమె ఎవరితోనూ చెప్పలేదు. దాన్ని అలుసుగా తీసుకున్న నిందితులు ఆర్నెళ్లుగా బాధిత బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం జరిపారు.

గుడి వద్ద ఏడుస్తూ కనిపించిన బాలిక..
మంగళవారం బాలికను బలవంతంగా ఓ చోటుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఓ గుడి వద్ద వదిలి వెళ్లిపోయారు. బాలిక గుడి వద్ద ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుల్లో బాలిక స్నేహితులు కూడా..
నిందితులపై పోలీసులు 376-D,పోక్సో చట్టాలతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాలను నమోదు చేశారు. 10మంది నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, వారిలో కొందరు బాలిక స్నేహితులేనని పోలీసులు చెప్పడం గమనార్హం. వారిలో కొందరు ఆటో డ్రైవర్స్ అని చెప్పారు. ఆర్నెళ్లుగా ఆమెను బలవంతంగా పలు ప్రదేశాలకు తిప్పి అత్యాచారానికి పాల్పడ్డట్టు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని,నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications