అదుపు తప్పిన ఏనుగు: ఉత్సవాల్లో భయోత్పాతం
Kerala: కేరళ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ ఏనుగు అదుపు తప్పింది. భీబత్సాన్ని సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్టుగా తొక్కిపడేసింది. ఓ భక్తుడిని తొండంతో ఎత్తి అవతలికి విసిరేసింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
మళప్పురం జిల్లాలోని తిరూరు సమీపంలో గల పుథియంగడిలో అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనరకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పుథియంగడిలో నేర్చా ఉత్సవాన్ని నిర్వహించారు స్థానికులు. మంగళవారం రాత్రి ఈ ఉత్సవం ఆరంభమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. రాత్రంతా జాగారణ ఉంటూ, వేడుకల్లో పాల్గొనడం, ఏనుగులతో ఊరేగింపును నిర్వహించడం ఆనవాయితీ. ఓ జాతరలాగా దీన్ని ఏర్పాటు చేశారు.
వేడుకల్లో భాగంగా అయిదు ఏనుగులను అందంగా అలంకరించారు. ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో ఈ అయిదింట్లో పాక్కత్ శ్రీకుట్టన్ అనే ఏనుగు అదుపు తప్పింది. ఒక్కసారిగా భక్తుల గుంపుపైకి దూసుకెళ్లింది. కనిపించిన వారిని కనిపించినట్టే తొక్కుకుంటూ వెళ్లింది. వారిలో ఒకరిని తొండంతో అందిపుచ్చుకుని దూరంగా విసిరేసింది.
#Kerala; An elephant named Pakkathu Sreekuttan ran amok during the Tirur Puthiyangadi festival, triggering chaos and leaving 17 people injured, including one in critical.
— South First (@TheSouthfirst) January 8, 2025
The incident occurred around 12:30 AM on the festival's final day. The elephant, reportedly in musth, turned… pic.twitter.com/Shk8jfbeFN
ఆ సమయంలో మావటి ఏనుగు పైనే ఉన్నప్పటికీ దాన్ని అదుపు చేయలేకపోయాడు. కొద్దిసేపటి తరువాత ఆ ఏనుగు శాంతించింది. ఏనుగు సృష్టించిన బీభత్సానికి ఉత్సవంలో స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని కొట్టక్కల్ ఎంఐఎంఎస్ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications