బిగ్ షాట్ ప్రియురాలు, వేరే వ్యక్తులతో చనువు, ఫోన్ నెంబర్ బ్లాక్, విదేశాల్లో చదువు, కిడ్నాప్

కోయంబత్తూరు /ఏర్నాకులం: తనను ప్రేమించిన శ్రీమంతుల అమ్మాయి తరువాత దూరం అయ్యి ఇప్పుడు వేరే వ్యక్తులతో చనువుగా ఉంటోందని, విదేశాలకు వెళ్లి చదువుకుంటానని మొండికి వేస్తోందని సహించలేని యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. తనకు దక్కని నువ్వు వేరు వ్యక్తులకు దక్కకూడదని, నువ్వు ఎలా విదేశాలకు వెళ్లి ఉన్నత చదువు చదువుతావో నేను చూస్తానని రెచ్చిపోయిన యువకుడు ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసి ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు.

ప్రేమలో ఇంటర్ విద్యార్థి

ప్రేమలో ఇంటర్ విద్యార్థి

కేరళలోని ఎర్నాకులం సమీపంలోని కలూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇవా డేనియల్ (17) అనే యువతి ప్లస్ టూ (ఇంటర్) విద్యాభ్యాసం చేస్తున్నది. ఇవా డేనియల్ కోటీశ్వరురాలు. ఇవా డేనియల్ కు అదే ప్రాంతానికి చెందిన సబార్షా అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇవా డేనియల్, సబార్షాల పరిచయం స్నేహంగా మారింది. సబార్షా కారు షో రూంలో పని చేస్తున్నాడు.

లవ్, విదేశాల్లో చదువు

లవ్, విదేశాల్లో చదువు

ఇవా డేనియల్, సబార్షా స్నేహం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కలిసి సినిమాలు, షికార్లకు తిరగడం మొదలు పెట్టారు. ఇంటర్ పూర్తి అయిన తరువాత తాను విదేశాలకు వెళ్లి చదువుకుంటానని, మా కుటుంబ సభ్యులు అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఇవా డేనియల్ ఆమె ప్రియుడు సబార్షాకు చెప్పింది.

పెళ్లికి ముందే పెత్తనం, ఫోన్ నెంబర్ బ్లాక్

పెళ్లికి ముందే పెత్తనం, ఫోన్ నెంబర్ బ్లాక్

నీవు విదేశాలకు వెళ్లి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తోందని, తరువాత నన్ను మరిచిపోయి నువ్వు వేరే వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఉందని, అందుకు తాను అంగీకరించనని సబార్షా ప్రియురాలు ఇవా డేనియల్ కు చెప్పాడు. తరువాత ఈవిషయంలో చాలాసార్లు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవలు మొదలైనాయి. తాను తల్లిదండ్రులు చెప్పినట్లు విదేశాలకు వెళ్లి చదువుకుంటానని తేల్చి చెప్పిన ఇవా డేనియల్ తరువాతతన మాటకు ఎదురు చెప్పిన ప్రియుడు సబార్షా మొబైల్ నెంబర్ బ్లాక్ చేసి అతన్ని దూరం పెట్టింది.

కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి మాయం

కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి మాయం

మంగళవారం ఉదయం ఇవా డేనియల్ కాలేజ్ వెళ్లింది. ఆ సమయంలో కారులో వెళ్లిన సబార్షా ప్రియురాలు ఇవా డేనియల్ ను కిడ్నాప్ చేశాడు. సాయంత్రం ఇవా డేనియల్ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటంబ సభ్యులు గాలించారు. బుధవారం వరకు ఇవా డేనియల్ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇవా డేనియల్ కోసం గాలించారు.

కారుతో పరారైన ప్రియుడు

కారుతో పరారైన ప్రియుడు

కేసు విచారణ చేసిన పోలీసులకు ఇవా డేనియల్ కు సబార్షా అనే ప్రియుడు ఉన్నాడని తెలిసింది. సబార్షాతో పాటు అతను పని చేస్తున్న షోరూంలో కారు మాయం అయ్యిందని పోలీసులకు తెలిసింది. ఇవా డేనియల్ ను సబార్షా కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేరళ, తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అటవి ప్రాంతంలో హత్య

అటవి ప్రాంతంలో హత్య


కోయంబత్తూరు శివార్లలోని అటవి ప్రాంతంలోని వాల్ పారై సమీపంలో పోలీసులు సబార్షా ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. అయితే కారులో ఇవా డేనియల్ లేకపోవడంతో పోలీసులు సబార్షాను బెండ్ తీశారు. తనతో కాకుండా వేరే అబ్బాయిలతో ఇవా డేనియల్ చనువుగా ఉంటోందని, అంతే కాకుండా ఆమె విదేశాలకు వెళ్లి చదువుకుంటానని చెప్పిందని, ఎక్కడ తనకు దూరం అవుతుందో అనే భయంతో ఆమెను కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలో హత్య చేశానని సబార్షా పోలీసుల విచారణలో అంగీకరించాడు. తమిళనాడు పోలీసులు సబార్షాను వెంట తీసుకుని వెళ్లి అటవి ప్రాంతంలో ఇవా డేనియల్ మృతదేహాన్ని గుర్తించారు. ఇవా డేనియల్ మృతదేహాన్ని, సబార్షాను కేరళ పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+