మేనకోడలిని రేప్ చేసి హత్య చేసి భయంతో అంకుల్ ఆత్మహత్య
కర్ణాటకలోని కలబురిగి నగర శివార్లో ఇంటిలో ఒంటరిగా ఉన్న మేనకోడలు హేమచంద (17) అనే యువతి మీద ఆమె మేనమామ విజయ్ కుమార (45) అత్యాచారం చేసి ఆమె విషయం బయటకు చెబుతుందనే భయంతో హత్య చేసి ఆమె చున్నీతోనే అతను ఉరి.
బెంగళూరు: ఇంట్లో ఒంటరిగా ఉన్న మేనకోడలి మీద అత్యాచారం చేసి తరువాత హత్య చేసిన నిందితుడు అదే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని కలబురిగి నగర శివార్లో జరిగింది.
హేమచంద (17) అనే విద్యార్థినిపై ఆమె మేనమామ విజయ్ కుమార్ రాథోడ్ (45) అనే వ్యక్తి అత్యాచారం చేసి దారుణంగా గొంతునులిమి హత్య చేసి పోలీసులు పట్టుకుంటారనే భయంతో యువతి చున్నీతోనే అదే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సురపురలో పశువైద్యుడిగా పని చేసే ఆయన కలబురిగి నగర శివార్లలోని కోటనూరలో కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇంటి నిర్మాణ బాధ్యతలను సోదరుడు విజయ్ కుమారకు అప్పగించారు. ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే విజయ్ కుమార సోదరి శాంతాబాయి, ఆమె కుమార్తె హేమచంద నివాసం ఉంటున్నారు.
శాంతాబాయి పనిపై రాత్రి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటిలో ఆమె కుమార్తె హేమచంద ఒక్కటే ఉంది. ఈ విషయం గుర్తించిన విజయ్ కుమార శాంతాబాయి ఇంటికి వెళ్లి హేమచంద మీద అత్యాచారం చేశారు. ఆమె ఎవరికైనా విషయం చెబుతుందనే భయంతో గొంతునులిమి హత్య చేశాడు.
తరువాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో అదే గదిలో హేమచంద చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, మరుసటి రోజు ఇంటికి వచ్చిన శాంతాబాయి విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కోటనూర పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications