వరుసకి అన్నతో కాలేజ్ లో లవ్, ఇద్దరిని నగ్నంగా చూసిన అక్క, నరాలు కత్తిరించి హత్య, నాటకాలు!
చెన్నై/ నమ్మక్కల్: వరుసకు సోదరుడు అయ్యే ప్రియుడితో కలిసి తిరుగుతున్న చెల్లిని మందలించిన అక్క వారి చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది. వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ప్రేమించడం ఏమటి ? మన గురించి సమాజం తప్పుగా అనుకుంటుందని బుద్దిమాటలు చెప్పిన అక్క మీద చెల్లి కక్ష పెంచుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న చెల్లెలు అతనితో ఏకాంతంగా రాసలీలలు సాగించింది. ఆ సమయంలో వారిని ఏకాంతంలో చూసిన అక్క గట్టిగా హెచ్చరించడంతో సహనం కోల్పోయిన చెల్లి, ఆమె ప్రియుడు కలిసి ఇంజనీరింగ్ విద్యార్థిని నరాలు కత్తిరించి అతి దారుణంగా హత్య చేశారు.

ఇంజనీరింగ్, ఇంటర్ విద్యార్థినిలు
తమిళనాడులోని నమ్మక్కల్ లోని కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన పళనిస్వామి శంకరన్ దంపతులు కూలి పని చేస్తున్నారు. పళనిస్వామి శంకరన్ దంపతులకు ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న మోనిషా (19), ఫ్లస్ టూ (ఇంటర్)చదువుతున్న 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. పళనిస్వామి శంకరన్ దంపతులు కష్టపడి ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నారు.

వరుసకు అన్నతో లవ్
మోనిషా చదువుతున్న కాలేజ్ లోనే రాహుల్ (19) చదువుతున్నాడు. వరుసకు మోనిషా, ఆమె చెల్లికి రాహుల్ వరుసకు సోదరుడు అవుతాడు. అయితే వరుసకు అన్న అయ్యే రాహుల్ ను మోనిషా చెల్లెలు ప్రేమించింది. రాహుల్, ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఎక్కడపడితే అక్కడ తిరగడం మొదలు పెట్టారు.

మండిపడిన ఫ్యామిలీ
ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఇష్టం వచ్చినట్లు రాహుల్ తో తిరగడంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు వీరి గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పళనిస్వామి శంకరన్ దంపతులు కుమార్తెకు బుద్దిమాటలు చెప్పారు. అయినా ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో మోనిషా రాహుల్ తో తిరగరాదని చెల్లిని హెచ్చరించింది.

ఏకాంతంలో చూడరాని చోట!
ఈ నెల 4వ తేదీన పళనిస్వామి శంకరన్ దంపతులు పనికి వెళ్లారు. కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో కాలేజ్ లు మూసివేయడంతో మోనిషా, ఆమె చెల్లెలు ఇంట్లోనే ఉన్నారు. తరువాత భోజనం చేసిన మోనిషా నిద్రపోయింది. ఆ సమయంలో ప్రియుడు రాహుల్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న యువతి అతనితో మరో గదిలో ఏకాంతంగా రాసలీలలు జరిపింది. ఆ సమయంలో నిద్రలేచిన మోనిషా ఏకాంతంగా నగ్నంగా ఉన్న సోదరి, రాహుల్ ను చూసి షాక్ కు గురైయ్యింది.

తల మీద దాడి చేసి నరాలు కత్తిరించి!
బయట తిరిగి కుటుంబం పరువు తియ్యడమే కాకుండా చివరికి ఇంట్లోనే రాసలీలలు సాగిస్తున్నావా ? అంటూ మోనిషా చెల్లి మీద చెయ్యి చేసుకుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే పోలీసు కేసు పెడుతానని రాహుల్ ను హెచ్చరించింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రాహుల్ ప్రియురాలి అక్క మోనిషా తల మీద దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది. తరువాత వంట గదిలో ఉన్న కత్తి తీసుకు వచ్చిన రాహుల్, ఆమె ప్రియురాలు మోనిషా చేతి నరాలు కత్తిరించారు. ఆ సమయంలో మోనిషా రక్తం రాహుల్ కు, అతని ప్రియురాలికి అంటుకోవడంతో అలాగే వారు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు.

పోస్టుమార్టుం నివేదికలో!
ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు మంచం మీద రక్తపుమడుగులో పడి ఉన్న మోనిషాను నమ్మక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మోనిషా మరణించిందని వైద్యులు చెప్పారు. మొదట మోనిషా చేతినరాలు కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకుందని అందరూ బావించారు. అయితే పోస్టుమార్టుం నివేదికలో ఆమె తల మీద దాడి చేసి గొంతు నులిమిన తరువాత చేతి నరాలు కత్తిరించారని వెలుగు చూసింది.
Recommended Video

సోదరిని గర్భవతిని చేసి!
పోలీసులకు అనుమానం వచ్చి మోనిషా సోదరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను రాహుల్ ప్రేమించుకున్నామని, ఈ విషయం తెలిసిన తన అక్క మోనిషా వ్యతిరేకించిందని, అంతే కాకుండా మేము ఏకాంతంగా ఉన్న సమయంలో తమను చూసిందని, ఎక్కడ తల్లిదండ్రులకు విషయం చెబుతుందో అనే భయంతో రాహుల్ తో కలిసి హత్య చేశామని అంగీకరించింది. ప్రస్తుతం మోనిషాను హత్య చేసిన ఆమె సోదరి గర్బవతి అని వెలుగు చూసింది. మోనిషాను హత్య చేసిన ఆమె సోదరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాల నేరస్తుల కారాగారంకు తరలించామని, పరారైనా రాహుల్ కోసం గాలిస్తున్నామని నమ్మక్కల్ పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications