17 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని.. 15వ అంతస్తు నుంచి దూకి...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునేందుకు ఏకంగా 15వ అంతస్తు నుంచి దూకేసింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. యువతి ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.
ముంబై భాందూప్‌లో ఉంటూ విద్యార్థిని చదువుకొంటుంది. ఆమె స్వస్థలం మారుమూల ప్రాంతం కాగా.. పై చదువుల కోసం సిటికీ వచ్చింది. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతుంది. చదువుల్లో ఆమె ఎప్పుడూ ముందు ఉండేదని పేరెంట్స్ చెబుతుంటారు. కానీ ఇటీవల మార్కులు తగ్గడంతో ఆందోళన మొదలైంది. చదవడం లేదని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు నెలకొన్నాయి.

చదవడం లేదని ఆమె తండ్రికి తెలిసింది. చదవడం లేదా ? ఏం చేస్తున్నావు అని ఆయన మందలించాడు. గతంలో కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ పేరెంట్స్‌కు దూరంగా ఉండటం, బెంగతో తిట్టడంతో ఏం చేయాలో తెలియలేదు. తనకుతాను సర్దిచెప్పుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. డ్రీమ్ బిల్డింగ్ అపార్ట్‌మెంట్ 15వ అంతస్తుపైకి ఎక్కి మరీ దూకింది. దీంతో తీవ్రగాయాలతో చనిపోయింది. ఆమె మృతికి చదువు విషయంలోనే తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఖచ్చితమైన సమాధానం మాత్రం విచారణలో తెలుస్తుందని చెప్పారు.
ఓ విద్యాకుసుమం బలవన్మరణం కలచివేస్తోంది. చదువులో కాస్త వెనకబడితే ఆత్మహత్య చేసుకోవాలా అని మేధావులు చెప్తున్నారు. గుండె ధైర్యం చేసుకొని, మనో నిబ్బరంతో.. జీవింతపై పోరాడి గెలువాలని సూచిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications