గ్యాంగ్‌రేప్‌పై ఫిర్యాదు: యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన నిందితులు

17-years-old ‘rape victim’ set on fire in Ludhiana
లూథియానా: పంజాబ్ రాష్ట్రంలోని దండారిఖుర్ద్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. తమపైనే అత్యాచారం కేసు పెడతావా అంటూ ఆరుగురు దుండగులు ఓ యువతి(17)పై కిరోసిన్‌పోసి నిప్పంటించారు. గురువారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లూధియానా పోలీస్ కమిషనర్ ప్రమోద్‌బెన్ తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఆరుగురు దుండగుల్లో ముగ్గురిపై యువతి రెండు నెలల క్రితం రేప్ కేసు పెట్టింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

కాగా, ఈ ముగ్గురు నిందితులు వారం రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైయ్యారు. వీరు మరో ముగ్గురితో కలిసి గురువారం యువతి ఇంటికి వెళ్లారు. అనంతరం యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు.

ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు లూథియానా పోలీస్ కమిషనర్ ప్రమోద్ బాన్ తెలిపారు.

కాగా, నిందితులందరూ బీహార్‌కు చెందిన వారని పోలీసులు చెప్పారు. వీరిలో ఇప్పటికే సాజద్, అన్వర్‌లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని కమిషనర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+