అండర్ పాస్ లో చిక్కుకున్న గ్యాస్ ట్యాంకర్, 18 టన్నులు గ్యాస్, క్షణక్షణం భయం భయం !
బెంగళూరు/ధారవాడ: రోడ్డు దాటి అర్దగంట లోపు కంపెనీకి చేరుకోవలసిన గ్యాస్ ట్యాంకర్ అండర్ పాస్‌లో చిక్కుకోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని ధారవాడలో జరిగింది, 18 గంటల ఆపరేషన్ నిర్వహించిన సంబంధిత అధికారులు, సిబ్బంది చివరికి పెద్ద గండం నుంచి ప్రజలను రక్షించారు. అమావాస్యకు అందరూ గుడ్ బై చెప్పి శుభ శ్రావణ మాసంలో అడుగు పెట్టడానికి సిద్దం అయిన సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది.
రోడ్డు అండర్‌పాస్ కింద గ్యాస్ ట్యాంకర్ చిక్కుకుపోవడంతో 18 గంటల పాటు స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనిగడిపారు. ధారవాడ పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాల ప్రజలు ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నారు. పుణే-బెంగళూరు జాతీయ రహదారి నెంబర్ 4ఆర్‌హెచ్‌పి బాలియ అండర్‌పాస్‌లో బుధవారం రాత్రి హెచ్‌పీ కంపెనీకి చెందిన గ్యాస్ ట్యాంకర్‌లో అండర్ పాస్ లో చిక్కుకుపోయింది.

అండర్‌పాస్ ఆపరేటింగ్‌లో రోడ్డుపై తగిలినప్పుడు గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావడం మొదలుకావడంతో ప్రజలు హడలిపోయారు. వెంటనే పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఆ ప్రాంతం నుంచి పరుగు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 18 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
బేలూరు పారిశ్రామిక ప్రాంతంలోని హెచ్‌పీసీఎల్ యూనిట్‌కి ముంబాయి నుంచి వచ్చిన ఈ ట్యాంకర్ చేరుకుంది. అయితే డ్రైవర్ తీరా ముందే వచ్చి వదిలిపెట్టాడు, దీంతో హైకోర్టు ముందు ఎడమవైపు టర్న్ తీసుకున్న సర్వీస్ రోడ్డుకు డ్రైవర్ తర్వాత ఈ అండర్‌పాస్ ద్వారా ఆచెల్ రోడ్డు చేరేందుకు ప్రయత్నించాడు. ఆ సందర్బంలో అండర్ పాస్ లో గ్యాస్ ట్యాంకర్ చిక్కుకుపోయింది.

వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 18 టన్ను సామర్థ్యంతో గ్యాస్ ట్యాంకర్ ఉన్నందున త్వరగా ఖాళీ చేయడమే సవాలుగా మారింది. కొన్ని గంటల పాటు గ్యాస్ లీక్ అయ్యింది. అయితే మరో ఖాళీ గ్యాస్ ట్యాంకర్ తెప్పించి అండర్ పాస్ లో చిక్కుకున్న గ్యాస్ ట్యాంకర్ లోని గ్యాస్ ను అందులో నింపి ఆ ట్యాంకర్ ను అక్కడి నుంచి తరలించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సుమారు 20 గంటల పాటు ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications