బర్త్ డే రోజు గ్యాంగ్ రేప్: ఇద్దరి అరెస్ట్, ఒకరు మైనర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పుట్టిన రోజు నాడే 18 ఏళ్ల యువతి పైన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరు పశ్చిమ బంగాకు చెందిన వారు. నిందితుల్లో ఒకరు బాల నేరస్తుడు ఉన్నాడు.
ఏడాది క్రితం నుండి వారి మధ్య పరిచయం ఉంది. శుక్రవారం ఆ యువతి 18వ పుట్టిన రోజు సందర్భంగా వేడుక నిర్వహించేందుకు వారు ఆమెను తమ గదికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన పైన యువతి ఆర్కే పురం పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు.
నిందితులు రాహుల్ (20), 17 ఏళ్ల యువకుడిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి ఢిల్లీలోని నియామక సంస్థలో పని చేస్తూ, వారి బంధువుల ఇంట్లో ఉంటోంది. నిందితులిద్దరికి కూడా ఆమె పని చేసే చోట క్లీనింగ్ స్టాఫ్‌గా పని చేస్తున్నారు.

కాగా, 18 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. వారిద్దరు కూడా బాధితురాలికి తెలిసినవారే కావడం విశేషం. జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని తీసుకుని వెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు శనివారంనాడు చెప్పారు.
ఇద్దరు వ్యక్తులపై సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బాధితురాలు ఆర్‌కె పురం పోలీసు స్టేషన్‌లో గత రాత్రి ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అప్పుడు పోలీసులు తెలిపారు.
శుక్రవారంనాడు తన 18వ జన్మదినమని, ఈ సందర్భంగా వేడుకలు చేసుకుందామని తనను ఓ నిర్మానుష్యం ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications