ఘోరం: ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని.. స్నేహితుడి గొంతుకోసి, 54సార్లు పొడిచి చంపాడు
ముంబై: మహారాష్ట్రలోని బాంద్రాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ముందు పదే పదే ఇంగ్లీషులో మాట్లాడి, తనకు చదువు రాదని అవమానిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడు అతని స్నేహితుడ్ని కిరాతకంగా హత్య చేశాడు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
గొంతుకోయడంతోపాటు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54సార్లు కత్తితోపొడిచి చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసుల వద్ద లొంగిపోయాడు. బుధవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అమిర్ అబ్గుల్ వహీద్ రహీన్(21) అనే యువకుడికి మహ్మద్ అఫ్రాజ్ అలాం షేక్(18) అనే స్నేహితుడున్నాడు. కాగా, తనతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడుతూ.. రహిన్‌ను షేక్ వేధిస్తుండేవాడు.
రహిన్ చదువు కోలేదని తరచూ హేళనగా మాట్లాడుతుండేవాడు. దీంతో కోపం పెంచుకున్న రహిన్.. అలాంను హత్య చేయాలని కుట్ర పన్నాడు. వారం రోజులుగా తగిన సమయం కోసం వేచి చూసిన రహిన్.. బుధవారం రాత్రి అలాంను బాంద్రాలోని నిర్మానుష్య తీసుకెళ్లాడు.
అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం రహిన్ తన స్నేహితుడు అలాం గొంతు కోశాడు. ఆ తర్వాత అతని కడుపు, ఇతర భాగాల్లో 54సార్లు కత్తితో పొడిచాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం రహిన్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం. సాహునగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు రహిన్. జరిగిందంతా చెప్పడంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అలాం మృతదేహాన్ని గుర్తించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications