• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విషాదం: జాతీయ స్థాయి బాక్సర్ ఉరివేసుకుని ఆత్మహత్య

|

ముంబై: మహారాష్ట్రలోని అకోలాలో ఓ జాతీయస్థాయి యువ బాక్సర్ పవన్ రౌత్(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలో తన హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం పవన్ రౌత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని కోచ్ సతీష్ చంద్ర భట్ తెలిపారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో పవన్ రౌత్ మహారాష్ట్ర తరపున ప్రాతినిథ్యం వహించాడని కోచ్ సతీష్ చెప్పారు. నాగ్‌పూర్‌కు చెందిన పవన్ రౌత్ అకోలాలోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణలో ఉన్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు.

 19 year old national-level boxer commits suicide

కాగా, శుక్రవారం అకోలోలానే జరిగే ఒక టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉండగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అనారోగ్యంతో పవన్ రౌత్ శిక్షణకు రాలేదని, శుక్రవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కోచ్ సతీష్ తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర క్రీడా మంత్రి సునీల్ కేదార్ విచారం వ్యక్తం చేశారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

English summary
A 19-year-old national-level boxer from Nagpur allegedly ended his life by hanging himself in his hostel room in Akola in Maharashtra on Friday, his coach said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more