న్యూడ్ ఫోటోలు పంపు, లేకపోతే ఆత్మహత్య: ఇంటి వరకు వెళ్ళి, చివరికిలా..
ఓ అమ్మాయితో స్నేహం చేసిన యువకుడు ఆ అమ్మాయి నగ్న చిత్రాలు పంపించకపోతే చనిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది. అయితే బాధితురాలి తల్లి ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూణె: ఓ అమ్మాయితో స్నేహం చేసిన యువకుడు ఆ అమ్మాయి నగ్న చిత్రాలు పంపించకపోతే చనిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది. అయితే బాధితురాలి తల్లి ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్నత చదవులు చదువుతూనే స్నేహం ముసుగులో తోటి విద్యార్థినులను వేధిసున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. అయితే స్నేహం పేరుతో యువకుడిని నమ్మిన యువతిని వేధింపులు తప్పలేదు.
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఈ తరహ ఘటనలు అనేకం చోటు చేసుకొంటున్నాయి. అయితే అమ్మాయిలపై వేధింపులు చోటు చేసుకోకుండా పాలకులు ఎన్ని చర్యలు తీసుకొన్నా పలితం లేకుండా పోయింది.

స్నేహం పేరుతో బ్లాక్ మెయిల్
మహరాష్ట్రలోని పూణే నగరానికి చెందిన సారంగ్ మాత్రే అనే 19 ఏళ్ల యువకుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.ఓ అమ్మాయితో స్నేహం చేసిన యువకుడు ఆమె నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ప్రతి రోజూ ఈ విషయమై ఆ యువతిని వేధించేవాడు. స్నేహితుడని నమ్మితే సారంగ్ మాత్రే ఆ యువతికి చుక్కలు చూపించాడు.

ఇంటివరకు వెళ్ళి వేధించేవాడు
తన స్నేహితురాలిని నగ్న చిత్రాలు పంపాలని సారంగ్ మాత్రే వేధించేవాడు. కొన్నాళ్ళ పాటు ఆమె ఈ విషయాన్ని మౌనంగా భరించింది. అయితే కాలేజీ నుండి ఆమెతో పాటు ఇంటి దాకా వచ్చేవాడు. ఇంటి వరకు వచ్చి నగ్న చిత్రాల కోసం ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేసేవాడు. అంతేకాదు రాత్రి పూట ఆమె ఇంటి పరిసర ప్రాంతాల్లోనే సంచరించేవాడు. నగ్న చిత్రాల కోసం ఆ యువతిని మేసేజ్‌లు పెట్టేవాడు.

నగ్న చిత్రాలు పంపకపోతే ఆత్మహత్య
తాను కోరుకొన్నట్టుగా నగ్న చిత్రాలను పంపకపోతే ఆత్మహత్య చేసుకొంటానని సారంగ్ మాత్రే ఆ యువతికి మేసేజ్‌లు పెట్టాడు. నగ్న చిత్రాలు పంపాలని ఆమెకు డెడ్‌లైన్‌లు విధించాడు. డెడ్‌లైన్ లోపుగా నగ్న చిత్రాలు పంపకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. డెడ్‌లైన్ దగ్గర పడడంతో బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

పోలీసులకు ఫిర్యాదు
నగ్న చిత్రాల కోసం సారంగ్ మాత్రే వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత యువతి తల్లికి విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సారంగ్ మాత్రేపై ఐపీసీ సెక్షన్ 354 (ఎ), 354 (డి),506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.ఈ తరహ వేదింపులకు పాల్పడే నిందితులపై ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications