శశికళ కు షాక్:1987 నాటి పరిణామాలే, జయ తరహలోనే పన్నీర్

1987 లో అన్నాడిఎంకెలో చోటుచేసుకొన్న పరిణామాలే ప్రస్తుతం చోటుచేసుకొన్నాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు పార్టీ జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాలుగా విడిపోయింది.అయితే చివరకు

చెన్నై:అన్నాడిఎంకె లో ప్రస్తుతం చోటుచేసుకొన్న పరిణామాలు 1987 లో చోటుచేసుకొన్న పరిణామాలను పోలి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1987 లో ముగ్గురు ఎంఏల్ఏల మద్దతును కూడగట్టిన శశికళ చివరకు పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్నారు. ప్రస్తుత పరిణామాల్లో పన్నీర్ సెల్వం జయ తరహలో రాణిస్తారా, లేదా అనేది ఆసక్తిగా మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఎంజిఆర్ మరణించాడు. ఆయన మరణంతో అన్నాడిఎంకెలో వర్గాలు ఏర్పడ్డాయి.ఎంజిఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.అయితే ఆమె ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోయారు.

jayalalithaa

జయలలిత జానకీ రామచంద్రన్ ను వ్యతిరేకించారు. ఇద్దరూ కూడ తమదే అసలైన అన్నాడిఎంకె అంటూ చెప్పుకొన్నారు.అయితే చివరకు జయలలితే పై చేయి సాధించారు.

ఆనాడు జానకీ రామచంద్రన్ వెంటే పార్టీ నాయకులు , ఎంఏల్ఏలు ఉన్నారు.అంతేకాదు జయవెంటే ముగ్గురు మాత్రమే ఎంఏల్ఏలు ఉన్నారు.జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లను సాధించలేదు.జయలలిత పార్టీని ముందుకు నడిపించారు.

అదే సమయంలో జానకీ రామచంద్రన్ రాజకీయాలకు దూరమయ్యారు. అదే సమయంలో జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని పనిచేసిన నాయకులు కూడ తిరిగి జయ గూటికి చేరారు.

అయితే ప్రస్తుతం పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన సమయంలో ఆయన వెంట ముగ్గురు మాత్రమే ఎంఏల్ఏలు ఉన్నారు.పార్టీ శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ ఉన్నారు.మెజారిటీ ఎంఏల్ఏలు ఆమె వెంటే ఉన్నారు.

అయితే శశికళ గ్రూప్ లో ఉన్న ఎంఏల్ఏలు, నాయకులు పన్నీర్ సెల్వం వద్దకు వస్తున్నారు. శశికళకు వ్యతిరేకంగా మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే తాజా సంక్షోభంలో 1987 తరహ పోలికలు ఉన్నాయి. ఈ సంక్షోభ పరిస్థితుల్లో జయ తరహలో పన్నీర్ విజయం సాధిస్తారా కనుమరుగౌతారా అనేది ఉత్కంఠగా మారింది.అయితే శశికళకు కేసులు అడ్డంకిగా ఉన్నాయి. కాని, పన్నీర్ సెల్వం క్లీన్ ఇమేజ్ ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+