బాలికను నగ్నంగా చేసి.. మహిళా టీచర్ల లైంగిక దాడి
పాట్నా: మగవాళ్ల నుంచే కాదు ఆడవాళ్ల నుంచి ఆడవాళ్లకే రక్షణ లేని రోజులు రావడం నిజంగా శోచనీయం. బీహార్ కు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు ఎల్.కే.జీ బాలికపై లైంగిక దాడి చేయడం కలకలం రేపుతోంది. బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్లో ఈ ఘోరం చోటు చేసుకుంది.
ఎల్.కే.జీ బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి.. బాలికను నగ్నంగా మార్చి.. ఆపై తమ విక్రుత చేష్టలతో బాలిక మర్మాంగాలపై దాడి చేశారు. ఇలా ప్రతీరోజు బాలికను లైంగికంగా వేధించడమే పనిగాపెట్టుకున్నారు. విషయాన్ని బాధిత బాలిక తన తల్లికి చెప్పడంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

ప్రస్తుతం నిందితులైన ఇద్దరు మహిళా టీచర్లను మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు పోలీసులు. బాలిక మర్మాంగాలపై గాయాలున్నట్టు పోలీసు రిపోర్టులో నిర్ధారణ అయింది. విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ ను కూడా విచారించారు పోలీసులు. మహిళా టీచర్లపై నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవని స్కూల్ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications