జైలులోని మావోయిస్టుకు పెన్ డ్రైవ్.. ఓపెన్ చేస్తే మొత్తం బూతు వీడియోలే!

Posted By:
Subscribe to Oneindia Telugu

కోయంబత్తూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ మావోయిస్టు కోసం ఇద్దరు వ్యక్తులు దుస్తులు తీసుకొచ్చారు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా వాటిలో ఓ పెన్ డ్రైవ్ దొరికింది. ఇదేంటబ్బా.. అనుకుని దాన్ని కంప్యూటర్ కు పెట్టి ఓపెన్ చేసిన జైలు అధికారులు షాక్ తిన్నారు. కారణం - దాన్నిండా బూతు వీడియోలున్నాయి.

ఈ ఘటన కోయంబత్తూరు సెంట్రల్ జైలులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన మావోయిస్టు అనూప్.. కోయంబత్తూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

2 held for bid to pass on pen drive to jailed Maoists

ఇటీవల మరో మావోయిస్టు సీపీ మెయిదీన్ సోదరుడైన సీపీ రషీద్, హరిహర శర్మ అనే మరోవ్యక్తి కలిసి జైలుకు దుస్తులు తీసుకొచ్చారు. వాటిని శిక్ష అనుభవిస్తున్న మావోయిస్టు అనూప్ కు అందజేయాల్సిందిగా కోరారు.

జైలు అధికారులకు అనుమానం వచ్చింది. ఆ దుస్తులను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్యాంటుకు ఉన్న రహస్య జేబులో ఓ పెన్ డ్రైవ్ కనిపించింది. దాంట్లో ఏదైనా రహస్య సమాచారం ఉందేమో అన్న అనుమానంతో దాన్ని వారు ఓపెన్ చేసి చూశారు.

అంతే- దాన్నిండా బూతు వీడియోలు దర్శనమిచ్చాయి. తొలుత అధికారులు షాక్ తిన్నప్పటికీ.. ఈ వీడియోల వెనుక ఇంకేదైనా రహస్య సమాచారం ఉందేమో అనే అనుమానం వచ్చింది. దీంతో వారు ఆ పెన్ డ్రైవ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి, దుస్తుల పేరుతో పోర్న్ వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొచ్చిన రషీద్, శర్మలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two persons from Kerala capital Thiruvananthapuram were arrested and remanded in custody on charges of attempting to pass on a pen drive to Maoists lodged in the Central Prison here. Harihara Sharma and Rasheed came to meet Maoists, particularly Anup, and wanted to hand over some clothes with police permission last evening. While frisking them before being allowing inside, the jail officials found a pen drive hidden in the bundle of clothes and alerted seniors, who confiscated the device and handed it over to authorities.
Please Wait while comments are loading...