ఎయిర్ హోస్టెస్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరి అరెస్టు
భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించారు.భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ:భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించారు.భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
భారత సంతతికి చెందిన జస్పాల్ సింగ్ , చంద్రదీప్ ఖైరాలు బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు.వీరిద్దరూ మార్చి 29న,లండన్ నుండి ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి వచ్చారు.

జైపూర్ లో ఓ వివాహ వేడుక కోసం భారత్ కు వస్తుండగా విమానంలో ఎయిర్ హెస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను వేధింపులకు గురిచేశారని డీసీపి(ఎయిర్ పోర్ట్) సంజయ్ భాటియా తెలిపారు. తమకు కొన్ని పుడ్ ఐటమ్స్ కావాలని మహిళా సిబ్బందిని అడిగారు.
అడిగిన వెంటనే ఆమె స్పందించకపోవడంతో ఆవేశానికి లోనై ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తోటి మహిళా సిబ్బంది ఈ విషయాన్ని విమాన సెక్యూరిటీ దృష్టికి తీసుకువెళ్ళారు,
విమానం ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్ పోర్ట్ పోలీసులు ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వీరిని పరీక్షించగా మద్యం సేవించి ఉన్నట్టు గుర్తించారు. మద్యం మత్తులోనే ఇలా ప్రవర్తించి ఉంటారని పోలీసులు తెలిపారు.నిందితులు బెయిల్ పై విడుదలయ్యారు. ఎయిర్ హెస్టెస్ పై వేధింపులకు పాల్పడటాన్ని ఎయిరిండియా తీవ్రంగా ఖండించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications