పంజాబ్‌లో పేలుడు : ఇద్దరు మృతి, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు సహా ఐదుగురికి గాయాలు

పోలీసు స్టేషన్ నుంచి తీసుకొచ్చిన మందుగుండు ఆ స్కాప్ డీలర్ ఇంట్లో విషాదాన్ని నింపింది. తీసుకొచ్చిన పనికిరాని వస్తువులను తుడుస్తోండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా .. ఐదుగురు గాయపడ్డారు. పంజాబ్‌లోని పుట్లిఘర్‌లో జరిగిన ఘటన విషాదం నింపింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అమృత్‌సర్ పుట్లిఘర్‌కు చెందిన స్కాప్ డీలర్ ఇంట్లో పాత వస్తువులను తుడుస్తోండగా పేలుడు సంభవించింది. స్కాప్ డీలర్ సిబ్బంది క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో హెడ్ కానిస్టేబుల్, హోం గార్డు, చిన్నారి ఉన్నారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

2 killed, 5 injured in a blast at scrap dealer’s house in Amritsar

అయితే ఈ చెత్తను సమీపంలోని పోలీసు స్టేషన్ నుంచి తీసుకొచ్చారని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. చెత్తతో పాటు మందుగుండు సామాగ్రి అందులో వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పేలుడు ఘటనపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించానని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడులో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+