కారులో స్కూల్ గర్ల్‌పై రేప్: ఇద్దరి అరెస్టు, గాలింపు

Arrest
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో కారులో ఓ పాఠశాల అమ్మాయిపై మంగళవారం అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అమ్మాయిపై కారులో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అమ్మాయి ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది.

కారులో తనతో రావాలని రోహిత్ అనే 22 ఏళ్ల యువకుడు ఆమెను ఆహ్వానించినట్లు, ఓ ఫ్రెండ్ ద్వారా అతనితో పరిచయం ఉండడంతో ఆమె కారు ఎక్కినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కారులో నరేంద్ర, టింకు అనే ఇద్దరు రోహిత్ మిత్రులు ఎక్కారు.

ఆ ముగ్గురు కూడా అమ్మాయి నివాసం ఉండే ప్రాంతంలోనే ఉంటారని పోలీసులు చెప్పారు. కారులో అమ్మాయికి మత్తు కలిపిన పానీయం ఇచ్చారని, ఆ తర్వాత కారును నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకని వెళ్లి కారులో ఆమెపై అత్యాచారం జరిపారని పోలీసులు చెబుతున్నారు.

ఆ తర్వాత అమ్మాయిని ఇంటికి సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రోహిత్, నరేంద్రలను అరెస్టు చేశారు. మూడో వ్యక్తి టింకూ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+