Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళ కిడ్నాప్; రేప్ చేస్తుంటే ప్రతిఘటిస్తే కళ్ళలో యాసిడ్ పోసి.. అన్న ముందే దారుణం ..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని బరాహో గ్రామంలో ఓ మహిళను, ఆమె సోదరుడిని ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటిస్తున్న క్రమంలో ఆమె కళ్ళలో యాసిడ్ పోశారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు.

 ఓ యువతి పారిపోవటానికి సహరించిందని మహిళ కిడ్నాప్, ఆమె సోదరుడిపైనా దాడి

ఓ యువతి పారిపోవటానికి సహరించిందని మహిళ కిడ్నాప్, ఆమె సోదరుడిపైనా దాడి

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని బరాహో గ్రామంలో నివసిస్తున్న 21 సంవత్సరాల మహిళ, అదే గ్రామంలో నివసిస్తున్న మరో యువతి వేరే వ్యక్తితో కలిసి గ్రామం విడిచి పారిపోవడానికి సహకరించింది అన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళను, మహిళతో పాటు ఆమె సోదరుడిని కిడ్నాప్ చేశారు. గ్రామం నుండి వారిని కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కిడ్నాప్ అయిన వారి నుండి గ్రామం నుండి పారిపోయిన యువతి ఎక్కడ ఉందో చెప్పాలని సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. బాధితురాలి సోదరుడిని తీవ్రంగా కొట్టారు.

మహిళపై అత్యాచార యత్నం, ప్రతిఘటిస్తే కళ్ళలో యాసిడ్ పోసి హింస

మహిళపై అత్యాచార యత్నం, ప్రతిఘటిస్తే కళ్ళలో యాసిడ్ పోసి హింస

తాము అడిగిన సమాచారం చెప్పాలని, లేదంటే అత్యాచారం చేస్తామని బెదిరించి, చివరకు అత్యాచార ప్రయత్నం చేశారు.నిందితుల అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన క్రమంలో మహిళ కళ్ళలో తేజాబ్ యాసిడ్ ను పోశారు. తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసిన తరువాత మహిళతో పాటు సోదరుడిని మళ్లీ గ్రామంలో పడేసి వారు పరారయ్యారు. కళ్ళల్లో యాసిడ్ పోయడంతో బాధిత మహిళ కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆమెను పన్నా జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆమె కంటి చూపుపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో చిత్రకూట్ లోని కంటి ఆసుపత్రికి బాధిత మహిళను తరలించాలని రిఫర్ చేశారు.

నిందితులను పట్టుకున్న పోలీసులు .. నేడు కోర్టు ముందుకు

నిందితులను పట్టుకున్న పోలీసులు .. నేడు కోర్టు ముందుకు

పన్నా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ధరమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ, ఇద్దరు నిందితులను బాధితుడు గుర్తించడంతో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. బాధితులపై దాడి జరిగిన తర్వాత ఐదు గంటల్లోనే సైబర్ సెల్ సహకారంతో, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇద్దరు నిందితులు బరాహో గ్రామానికి చెందిన సుమేర్ సింగ్ మరియు గోల్డి రాజాగా గుర్తించామని వెల్లడించారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను నేడు కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్ లో విపరీతంగా నేరాలు .. దారుణ ఘటనలు

మధ్యప్రదేశ్ లో విపరీతంగా నేరాలు .. దారుణ ఘటనలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, కిడ్నాప్లు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. నిత్యం మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది. ముఖ్యంగా బాలికల పై , మహిళల పై అత్యాచారాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగినంత గా ఏ ఇతర రాష్ట్రాల్లోనూ జరగడం లేదు. తాజా పరిణామాలు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, నిందితులకు ఎన్ని శిక్షలు పడుతున్నా ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అఘాయిత్యాలకు, దారుణ నేరాలకు మధ్య ప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై నేరాల నియంత్రణ కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా, సమ్మాన్ వంటి అనేక కార్యక్రమాలు నేరాల నియంత్రణ కోసం నిర్వహిస్తున్నా పరిస్థితి అలాగే ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+