'బ్రతికే ఉందనుకుని.. శవాన్ని రేప్ చేసిన యువకులు'

బెంగుళూరు : పనిచేయించుకుని జీతం ఇవ్వని యజమాని పట్ల ఇద్దరు యువకులు కక్ష పెంచుకున్నారు. వాళ్లిద్దరి కక్షకు యజమాని భార్య బలైపోయింది. అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చడమే కాకుండా.. ఆపై మరింత పాశవికంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. శవాన్ని సైతం వదలని ఆ కీచకులు ప్రస్తుతం కటకటాల పాలయ్యారు.

అసలు విషయానికొస్తే.. సంజయ్ గుప్తా అనే ఓ వ్యక్తి బెంగుళూరులో పానీపురం వ్యాపారం చేస్తున్నాడు. అజద్ అలీ(20), శ్యామ్(22) కొన్నాళ్లు సంజయ్ గుప్తా పానీపురి బండి వద్ద సహాయకులుగా పనిచేశారు. వీళ్లిద్దరు బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి బెంగుళూరుకు వలసొచ్చారు. కొన్నాళ్లు సంజయ్ గుప్తా దగ్గర పనిచేసి మానేశారు.

కాగా, సంజయ్ గుప్తా నుంచి అజద్ అలీకి రూ.7500 రావాల్సి ఉంది. ఆ డబ్బు కోసం చాలాసార్లు సంజయ్ గుప్తాను అడిగినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో అతని పట్ల కక్ష పెంచుకున్న అజద్ అలీ స్నేహితుడు శ్యామ్ తో కలిసి సంజయ్ గుప్తా మీద దాడి చేసి డబ్బు తీసుకెళ్లాలనుకున్నారు.

2 men kill ex-boss's wife, rape her thinking she's alive

ఇదే క్రమంలో.. బెంగళూరు నగరంలోని కోనన్ కుంట దగ్గర చుంచుఘట్ట ప్రధాన రహదారిపై ఉన్న సంజయ్ గుప్తా ఇంటికి రాత్రి సమయంలో వెళ్లారు అజద్ అలీ, శ్యామ్. ఆ సమయంలో.. సంజయ్ గుప్తా భార్య మాత్రమే ఇంట్లో ఉంది. అంతకుముందు తమవద్ద పనిచేసినవారే కావడంతో.. ఇంట్లోకి పిలిచి టీ తీసుకొస్తానని కిచెన్ వైపు వెళ్లింది.

అంతే.. ఆపై క్షణాల్లో ఆమెపై దాడి చేశారు అజద్ అలీ, శ్యామ్. బండరాయితో ఆమె తలమీద మోదడంతో తీవ్రంగా గాయపడి ఊర్మిల చనిపోయింది. అయితే ఆమె బ్రతికే ఉందన్న ఆలోచనతో నిందితులిద్దరు ఆమె శవంతోనే తమ కామ వాంఛను తీర్చుకున్నారు. అనంతరం ఇంట్లో ఉన్న డబ్బుతో ఉడాయించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి రాత్రి 10.45గం.ట సమయంలో సంజయ్ గుప్తా ఇంటికి చేరుకున్నాడు.

విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో.. తొలుత సంజయ్ గుప్తా పైనే అనుమానం వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్యపుర పోలీసులు. అనంతరం విచారణ చేపట్టగా.. అసలు నిందితులు అలహాబాద్ లో దిరికిపోయారు. ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరు ఉద్దేశపూర్వకంగా ఊర్మిలను హత్య చేయలేదని పేర్కొన్నారు. 'గతంలో వీరిద్దరికీ ఎలాంటి క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ లేదని, హత్య సమయంలో ఆమె బ్రతికే ఉందన్న ఆలోచనతో నిందితులిద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు' తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+