ఎన్‌కౌంటర్: హిజ్బుల్ కమాండర్‌తోపాటు మరో ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, 22 రాష్ట్రీయ రైఫిల్స్‌కి చెందిన భద్రతా దళాలకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో... ఆ ప్రాంతం మొత్తం కార్డన్ సెర్చ్ నిర్వహించి ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టాయి.

భద్రతా దళాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై ఎదురుకాల్పులకు దిగినట్టు అధికారులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదులను హిజ్బుల్ డిస్ట్రిక్ కమాండర్ పర్వేజ్ అహ్మద్, ఉమర్ ఘాజీలుగా గుర్తించారు.
ఉమర్ ఘాజీ మారుపేరుతో తిరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. వీరివద్ద నుంచి ఏకే-47 రైఫిల్‌తో పాటు, మరికొన్ని అణ్వాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనాస్థలిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications