ఉమెన్స్ డే: రోడ్డుపై తన్నుకున్న మహిళలు(వీడియో)
సూరత్: సూరత్‌లో ఇద్దరు మహిళలు నడి రోడ్డు పైన కొట్టుకున్నారు. ఒకరి జుత్తు మరొకరు పట్టుకుని సిగపట్లు పడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ బూతులు తిట్టుకున్నారు. వారిని ఆపేందుకు వచ్చిన పురుషులను తోసేసి మరీ కొట్టుకున్నారు.
దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనికి 'ఉమెన్స్ డే స్పెషల్' పోస్ట్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్‌చల్ చేస్తోంది. వారి మధ్య గొడవకు చాలా చిన్న కారణం ఉండటం గమనార్హం.
ముందు కారులో వెళ్తున్న మహిళ... వెనుక కారులో వస్తున్న మహిళకు సైడ్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె ముందుకు దూసుకువచ్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరూ కార్లలోంచి దిగి తిట్టుకున్నారు. తర్వాత నడిరోడ్డుపై తన్నుకున్నారు.












Click it and Unblock the Notifications